News April 2, 2025
రెవెన్యూ సేవలలో జాప్యం వద్దు: అనకాపల్లి కలెక్టర్

రెవెన్యూ సేవలలో జాప్యం ఉండకూడదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం రెవెన్యూ శాఖకు సంబంధించిన రీసర్వే మ్యూటేషన్లు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, నీటి తీరవా వసూళ్లు తదితర అంశాలపై తహశీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.
Similar News
News April 4, 2025
బుచ్చిబాబుకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

డైరెక్టర్ బుచ్చిబాబుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ఇటీవల 40వ బర్త్ డే జరుపుకున్న చరణ్.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆంజనేయస్వామి పాదుకలను డైరెక్టర్‌కు బహుమతిగా పంపారు. గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
News April 4, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. డా.ఎన్.గౌతమ్ రావును బరిలో నిలపాలని నిర్ణయించింది. సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటు?

రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోందని నేషనల్ మీడియా పేర్కొంది. వైసీపీ, బీజేడీ (ఒడిశా) పార్టీలు ఓటింగ్ సందర్భంగా తమ ఎంపీలకు విప్ జారీ చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపింది. దీంతో ఏడుగురు వైసీపీ ఎంపీలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఉంటారని వెల్లడించింది. కాగా బిల్లుకు 95 వ్యతిరేక ఓట్లు పడగా అందులో INDI కూటమి 88, BRS 4, అన్నాడీఎంకేవి 3 ఓట్లు ఉన్నట్లు సమాచారం.