News January 27, 2025

రేపు డయల్ యువర్ వనపర్తి డీఎం ప్రోగ్రాం

image

వనపర్తి డిపోలో రేపు  డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రజల నుంచి సూచనలు సలహాలు ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని తెలిపారు.7382826289 కు ఫోన్ చేసి సూచనలు ఇవ్వాలని కోరారు.

Similar News

News March 13, 2025

రేపు వైన్స్ బంద్

image

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(14న) మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.

News March 13, 2025

పెద్దపల్లి: 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ జరగాలి: సీఈఓ

image

తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, RDO గంగయ్య జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. మార్చి 19 లోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలన్నారు.

News March 13, 2025

హిందూపురం: ‘మహిళలు ప్రగతి బాటలో పయనించాలి’ 

image

మహిళలు సమస్యలపై అవగాహన పెంచుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి హారిక పేర్కొన్నారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హిందూపురం పరిధిలోని డీసీ కన్వెన్షన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలకు భద్రతపరంగా పోలీసు శాఖ ఎప్పుడూ సహకారం అందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. చట్టాలు ఎన్నో మహిళలకు అనుకూలంగా ఉన్నాయన్నారు.

error: Content is protected !!