News February 1, 2025

వరంగల్ పోలీసులకు పతకాలు

image

రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.

Similar News

News February 1, 2025

SSM29 గురించి జక్కన్న చెప్పేది అప్పుడేనా?

image

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కే SSMB29 షూటింగ్ విజయవాడ సమీపంలో వేసిన సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ నిబంధనల విషయంలో దర్శకుడు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు టాక్. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న జక్కన్న, తర్వాతి షెడ్యూల్‌ కెన్యా అడవుల్లో ప్లాన్ చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. అది పూర్తయ్యాక మూవీ టీమ్ గురించి వీడియోలో లేదా ఈవెంట్‌లో వివరించనున్నట్లు సమాచారం.

News February 1, 2025

రామగుండం: అధికారులతో సింగరేణి C&MD వీడియో కాన్ఫరెన్స్

image

రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో C&MDబలరాం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానించబడిన అటవీ భూమి మళ్లింపులు, పర్యావరణ క్లియరెన్స్ తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్, ఆంజనేయ ప్రసాద్, కుమార స్వామి, కర్ణ, వీరారెడ్డి తదితరులున్నారు.

News February 1, 2025

కేంద్ర మంత్రితో బాపట్ల ఎంపీ భేటీ

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం రూ.11,440 కోట్లు కేటాయించినందుకు ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలను ప్రస్తావించారు.