News February 5, 2025
వికారాబాద్: భూ సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి: కలెక్టర్
భూసమస్యలతో పాటు ఇతర సమస్యలపై అవగాహన పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతనంగా విధుల్లో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై అవగాహన కల్పించుకొని పరిణతితో ప్రజలకు చక్కగా సేవలందించాలన్నారు.
Similar News
News February 5, 2025
ప్రముఖ నటి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి పుష్పలత(87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో పుష్పలత నటించారు. తెలుగులో చెడపకురా చెడేవు, ఆడబిడ్డ, రాము, యుగపురుషుడు, వేటగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈమె కూతురు మహాలక్ష్మి హీరోయిన్‌గా రెండు జెళ్ల సీత, ఆనందభైరవి చిత్రాల్లో నటించారు.
News February 5, 2025
బాపట్ల: టీడీపీ స్థలం కబ్జా.. నిందితులు అరెస్ట్
బాపట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2000 సంవత్సరంలో దాతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వగా పలువురు స్థలాన్ని కబ్జా చేసి విక్రయించినట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News February 5, 2025
ప్రశాంత్ కిశోర్‌తో మంత్రి లోకేశ్ భేటీ!
నిన్న ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేశ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం 1-జన్‌పథ్‌లో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ఏపీ, బిహార్, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఐప్యాక్ నుంచి బయటికొచ్చిన ప్రశాంత్ బిహార్‌లో ‘జన్ సురాజ్’ పార్టీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.