News April 2, 2025
వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కింద పలు శాఖల అధికారులతో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. గతేడాది చేపట్టిన మలేరియా నివారణ చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ మరణాలు జరగకూడదన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News April 4, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. డా.ఎన్.గౌతమ్ రావును బరిలో నిలపాలని నిర్ణయించింది. సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటు?

రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోందని నేషనల్ మీడియా పేర్కొంది. వైసీపీ, బీజేడీ (ఒడిశా) పార్టీలు ఓటింగ్ సందర్భంగా తమ ఎంపీలకు విప్ జారీ చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపింది. దీంతో ఏడుగురు వైసీపీ ఎంపీలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఉంటారని వెల్లడించింది. కాగా బిల్లుకు 95 వ్యతిరేక ఓట్లు పడగా అందులో INDI కూటమి 88, BRS 4, అన్నాడీఎంకేవి 3 ఓట్లు ఉన్నట్లు సమాచారం.
News April 4, 2025
పెద్దపల్లి: దరఖాస్తుల గడువు పొడగింపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను ఆఫ్ లైన్‌లో సంబంధిత మండల పరిషత్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల యువకులు నిర్ణిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.