News January 27, 2025
సంగారెడ్డి: KCRను కలిసేందుకు పాదయాత్ర

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు తెలంగాణ తొలి సీఎం KCRను కలిసేందుకు సోమవారం ఝరాసంగం సంగమేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. 4 రోజుల పాటు సాగే పాదయాత్ర గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని KCR ఫామ్ హౌస్ వరకు సాగనుంది. పాదయాత్రను MLA మాణిక్ రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్ ప్రారంభించారు.
Similar News
News March 14, 2025
SRH కెప్టెన్‌ను మార్చితే..!

IPL-2025లో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటికి భారత ప్లేయర్లే కెప్టెన్లుగా ఉన్నారు. ఒక్క SRHకు మాత్రమే ఫారిన్ ప్లేయర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీంతో SRHకు కూడా స్వదేశీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జట్టులో తెలుగు ప్లేయర్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 14, 2025
కరీంనగర్: బాల్యంలో ఈ పూలతోనే హోలీ..!

కరీంనగర్ జిల్లాలో ఆ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్లుతుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
News March 14, 2025
పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.