News March 5, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి గోవిందురాం పాల్గొన్నారు.

Similar News

News March 6, 2025

‘RC16’.. జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్

image

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ‘RC16’ చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లుక్ టెస్టు పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావొచ్చని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది చివరిలోగా ‘RC16’ విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 6, 2025

హనుమంతవాక జంక్షన్లో యాక్సిడెంట్

image

హనుమంతవాక జంక్షన్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వరుస ఘటనలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

రెండు రోజులుగా దాదాపు రూ.1360 పెరిగిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గి సామాన్యుడికి ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది.

error: Content is protected !!