News April 4, 2025
సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

సంగారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీలు అయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న 17 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దార్లు శుక్రవారం విధుల్లో చేరాలని పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న చోట్ల నాయబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News April 12, 2025
ఇంటర్‌లో ఫలితాల్లో పల్నాడు జిల్లాకు 23వ స్థానం

రాష్ట్ర స్థాయిలో ఇంటర్ పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి పల్నాడు జిల్లా 23వ స్థానంలో నిలిచింది. వివరాలను జిల్లా అధికారి నీలావతి దేవి శనివారం వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలలో 40% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంతో పల్నాడు జిల్లా సరిపెట్టుకుంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 71% ఉత్తీర్ణతతో 9వ స్థానాన్ని సాధించిందన్నారు.
News April 12, 2025
చందుర్తి : నాలుగోతరగతి పరీక్షల్లో ఆసక్తికర సమాధానం రాసిన విద్యార్థిని

చందుర్తి మండలంలోని ఓ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తిగా రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు. నేటికాలంలో ఇంట్లో కోడళ్ళకు అత్తమామల పట్ల ప్రేమ ఏ విధంగా ఉందో విద్యార్థి సమాధానం ద్వారా అర్థమవుతుందన్నారు.
News April 12, 2025
రాబోయే 3 రోజుల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది.