News April 3, 2025

సిద్దిపేట: బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం

image

బీజేపీ సిద్దిపేట జిల్లా పదాధికారుల సమావేశాన్ని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకోని జిల్లా అంతటా వారం రోజుల పాటు కార్యక్రమాల నిర్వహించాలని సూచించారు.

Similar News

News April 14, 2025

కాంగ్రెస్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాబర్ట్ వాద్రా

image

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ భర్త అయినందునే ఇంతకాలం రాజకీయ చర్చల్లో తనపై విమర్శలు చేసేవారన్నారు. రాహుల్, ప్రియాంకలను చూసి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత తరుణంలో, పార్లమెంట్‌లో పోరాడటానికి మరిన్ని గొంతుకలు కావాలని రాబర్ట్ వాద్రా అభిప్రాయపడ్డారు.

News April 14, 2025

అందువలనే భారీ ప్రాణ నష్టం: ఐజీ

image

మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో పాటు బాణసంచా తయారు చేసే షెడ్లు పక్కపక్కనే ఉండడం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ ఐజీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. సోమవారం కైలాసపట్నంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

News April 14, 2025

డోస్ పెంచిన ఆశావహులు

image

TG: మంత్రిపదవుల ఆశావహులు డోస్ పెంచి గళం విన్పిస్తున్నారు. HYD, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ నేతనైన తనకు పదవి దక్కాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అటు ప్రజల కోసం తపించే తాను మంత్రి పదవికి అర్హుడినని రాజగోపాల్ అన్నారు. అయితే జానారెడ్డి లాంటివారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక తనకు మినిస్ట్రీ రాకుంటే మంచిర్యాలను ముంచినట్లే అని స్థానిక నేత ప్రేమ్ సాగర్ ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!