News April 3, 2025

సిరిసిల్ల: దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ధరణి దరఖాస్తులపై గురువారం వీసీ నిర్వహించారు. జిల్లాలో మొత్తం పెండింగ్ ఉన్న 408 ధరణి దరఖాస్తులను వారం రోజుల్లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్డీవోలు రాదాబాయి, రాజేశ్వర్, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.

Similar News

News April 10, 2025

చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్‌ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News April 10, 2025

కంగన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు.. అధికారులు ఏమన్నారంటే?

image

BJP ఎంపీ కంగనా రనౌత్ మనాలిలోని నివాసానికి <<16040761>>రూ.లక్ష కరెంటు బిల్లు<<>> రావడంపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ అధికారులు స్పందించారు. జనవరి 16 నుంచి ఆమె ఎటువంటి చెల్లింపులు చేయట్లేదని, సాధారణ ఇళ్ల వినియోగం కంటే ఆ ఇంటికి 1500% ఎక్కువగా కరెంటు లోడ్ ఉందని వెల్లడించారు. మొత్తం కలిపి రూ.90,384 బిల్లు చెల్లించాలని తేల్చి చెప్పారు. తాను అసలు ఆ ఇంట్లో ఉండట్లేదని కంగనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News April 10, 2025

ఒంటిమిట్టలో విద్యుత్ దీపాలంకరణలు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో “ ఒంటిమిట్ట‌కు త‌ర‌లివ‌చ్చిన అయోధ్య‌” అన్నట్టు శోభను సంతరించుకుంది. ఏకశిలానగరంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్‌తో ఏర్పాటు చేశారు.

error: Content is protected !!