News April 6, 2025

సీతంపేట: ఆటో బోల్తా.. ఒకరి మృతి

image

సీతంపేట పరిధిలో ఇసుకగెడ్డ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వెలగవాడకి చెందిన గొట్టపు లక్ష్మణరావు (36) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వలనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సీతంపేట ఎస్‌ఐ అన్నంరావు కేసు నమోదు చేశారు.

Similar News

News April 9, 2025

ఇంటి నుంచే పనిచేస్తున్న ఢిల్లీ సీఎం రేఖ

image

ఢిల్లీ CMగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయినా అధికారిక నివాసంపై నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. షాలిమార్ బాగ్‌లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో VIPలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 25KM ప్రయాణించి ఆమె సచివాలయానికి వెళ్తున్నారు. సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్‌లో నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News April 9, 2025

USAIDపై స్పందించిన వైట్‌హౌస్

image

వృథా ఖర్చులు తగ్గించుకోవడం కోసమంటూ నిలిపివేసిన USAID పునరుద్ధరణకు USA చర్యలు తీసుకుంటోంది. ఎక్కడో పొరపాటు జరిగిందని, నిధులు పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఫండ్స్ నిలిపివేయడంతో అంతర్యుద్ధాలతో అల్లాడే 14 దేశాలకు ఆహార సహాయం నిలిచిపోయింది. ఈ దేశాల్లో ఆకలి చావులు సంభవిస్తాయంటూ ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రపంచ ఆహార కార్యక్రమ(WFP) చెల్లింపులకు USA ముందుకొచ్చింది.

News April 9, 2025

జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి: సీతక్క

image

సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన సామాజిక అభివృద్ధి సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న పలు మహిళా శిశు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను సదస్సులో సీతక్క వివరించారు.

error: Content is protected !!