News January 27, 2025

సూర్యాపేట: 6 నెలల క్రితమే ప్రేమ వివాహం.. దారుణ హత్య 

image

సూర్యాపేట శివారులో మూసీ కాల్వకట్టపై మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(మాల బంటి) అనే యువకుడు <<15276798>>దారుణ హత్యకు<<>> గురయ్యాడు. ఆరు నెలల క్రితం కృష్ణతో వివాహమైందని అతని భార్య భార్గవి తెలిపింది. తన భర్తను హత్య చేశారని, న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News March 14, 2025

పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

image

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.

News March 14, 2025

వికారాబాద్: యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి: జడ్జి 

image

యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి శీతాల్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి శీతాల్ మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కల్పించుకుని బాల్యవివాహాల నిర్మూలనకు యువత కృషి చేయాలన్నారు.

News March 14, 2025

ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

image

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.

error: Content is protected !!