News March 25, 2025
సూర్యాపేట: CM రేవంత్ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

CM రేవంత్ ఈ నెల 30 ఉగాదిన సూర్యాపేట జిల్లా HNRకు రానున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 31, 2025
గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్

జిమ్ చేస్తూ గాయపడిన తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. గత ఏడాది చివర్లో ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
News March 31, 2025
‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.