News February 12, 2025

కరీంనగర్: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

కరీంనగర్ డివిజన్‌లో 50 జీడీఎస్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ జ్ఞానం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 12, 2025

చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.

News February 12, 2025

NZB: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.

News February 12, 2025

INDvsENG మ్యాచ్: అవయవదానానికి భారీ స్పందన

image

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే, పరుగులతో పాటు అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మ్యాచుకు ముందు అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని ఇరు జట్ల ప్లేయర్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు 15,754 మంది ప్రతిజ్ఞ చేశారు.

error: Content is protected !!