News February 5, 2025
బాపట్ల: టీడీపీ స్థలం కబ్జా.. నిందితులు అరెస్ట్
బాపట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2000 సంవత్సరంలో దాతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వగా పలువురు స్థలాన్ని కబ్జా చేసి విక్రయించినట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 5, 2025
కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.
News February 5, 2025
‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం
పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ పూర్తైతే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
News February 5, 2025
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్
TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.