News March 11, 2025
మందమర్రి: యాక్సిడెంట్.. నేరస్థుడికి జైలు శిక్ష

యాక్సిడెంట్ కేసులో నేరస్థుడికి 18నెలల జైలు, రూ.8వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జ్యుడీషియల్ జడ్జి విధించినట్లు SIరాజశేఖర్ తెలిపారు. SI కథనం ప్రకారం.. 2016లో మందమర్రి కానిస్టేబుల్ శ్రీధర్ బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుంచి అజాగ్రత్తగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసులో సాక్షులను విచారించిన జడ్జి నిందితుడు లారీ డ్రైవర్ సుధాకర్ రెడ్డికి జైలు శిక్ష విధించారు.
Similar News
News March 11, 2025
ఎలా డైట్ చేస్తే మంచిది?

వెంటనే బరువు తగ్గాలని కొందరు చేస్తున్న డైట్ ప్రాణాలకు ముప్పు తెస్తోంది. తాజాగా కేరళ యువతి <<15712364>>శ్రీనంద<<>> ఇలాగే ఆహారం మానేసి 5నెలల పాటు నీళ్లే తాగి చనిపోయింది. రోజూ మనం తీసుకునే ఫుడ్‌లో 500క్యాలరీల చొప్పున తగ్గిస్తే.. వారానికి 0.5కేజీ, నెలకు 2కిలోలు తగ్గుతామని వైద్యులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యవంతమైన డైట్ అని అంటున్నారు. కొందరు 24- 72hrs కేవలం నీళ్లతోనే డైట్ చేస్తారని ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
News March 11, 2025
‘ఛావా‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా‘ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11న ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. కాగా బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ మూవీ తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజులకే రూ.10 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
News March 11, 2025
మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.