News February 8, 2025

17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.

Similar News

News February 8, 2025

HNK: నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు: బల్దియా కమిషనర్

image

నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. బల్దియా పరిధిలోని హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్థులు సమర్పించిన నేపథ్యంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు.

News February 8, 2025

సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

image

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్‌స్టా చాట్‌లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్‌షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.

News February 8, 2025

కరుణ్ నాయర్ మరో సెంచరీ

image

డొమెస్టిక్ క్రికెట్‌లో విదర్భ ప్లేయర్ <<15137627>>కరుణ్ నాయర్<<>> వీరవిహారం చేస్తున్నారు. రంజీ క్వార్టర్ ఫైనల్-2లో భాగంగా తమిళనాడుతో మ్యాచులో ఆయన మరో సెంచరీ బాదారు. 180 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ 5 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీమ్ ఇండియాకు సెలక్ట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌కు BCCI ఎంపిక చేయలేదు.

error: Content is protected !!