News February 21, 2025
CONFIRM: గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్

తన బయోపిక్‌లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తారని మాజీ క్రికెటర్ గంగూలీ వెల్లడించారు. అయితే డేట్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావడానికి ఏడాది టైమ్ పడుతుందని చెప్పారు. గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు చేశారు. 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.
Similar News
News February 22, 2025
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ MLAగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.
News February 22, 2025
క్యాన్సర్ పేషెంట్లతో చైతూ-శోభిత

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు మధుర జ్ఞాపకాలను అందించేందుకు స్టార్ కపుల్ నాగ చైతన్య-శోభితలు ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌ను సందర్శించి అక్కడున్న క్యాన్సర్ బాధిత చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి, ఆటలాడుతూ చైతూ డాన్సులేశారు. సెల్ఫీలు దిగి వారిని సంతోషపరిచారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.
News February 22, 2025
RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కీలక పదవి

RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు మరో కీలక పదవి దక్కింది. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆయన్ను PM మోదీ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి త్వరలోనే ఆయన బాధ్యతలు చేపడతారు. RBI గవర్నర్‌గా ఆరేళ్లు పనిచేసిన దాస్‌కు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో విశేష అనుభవం ఉంది. ఎకనామిక్స్, ఫైనాన్స్, మినరల్స్, రెవెన్యూ శాఖలు, జీ20 షెర్ఫా, ADB బ్యాంకు, ప్రపంచ బ్యాంకు వ్యవహారాలపై బాగా పట్టుంది.