News February 25, 2025
మూడోరోజు.. ఇంకా లభించని ఆచూకీ

TG: SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని మూడురోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టన్నెల్‌లో భారీగా ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బురద మరింత పేరుకుపోతోంది. లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురద లోంచి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
Similar News
News February 25, 2025
హిజాబ్ తీయమన్నందుకు పరీక్షకు డుమ్మా!

యూపీలో హిజాబ్ కలకలం రేపింది. జౌన్‌పూర్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం హిజాబ్ తొలగించాలని కోరగా 10 మంది విద్యార్థినులు అందుకు నిరాకరించారు. అంతటితో ఆగకుండా పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లిపోయారు. హిజాబ్‌తో అనుమతిస్తేనే పరీక్షలకు పంపుతామని విద్యార్థినుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. మరోవైపు ఫేస్ వెరిఫికేషన్ కోసమే తాము హిజాబ్ తీయమని కోరినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు.
News February 25, 2025
సీఎం చంద్రబాబును కలిసిన వీహెచ్

AP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసి.. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ పేర్కొన్నారు.
News February 25, 2025
అనైతిక లేఆఫ్స్: వెనక్కి తగ్గిన ఇన్ఫోసిస్!

ట్రైనీ ఇంజినీర్ల అసెస్మెంట్ టెస్టును ఇన్ఫోసిస్ నిరవధికంగా వాయిదా వేసింది. మైసూర్ క్యాంపస్‌లో 350 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. OCTలో కంపెనీ 1000 మందిని నియమించుకుంది. వారు 3 దఫాల్లో అసెస్మెంట్ క్లియర్ చేయకుంటే ఇంటికెళ్లాల్సిందే. మొన్న ట్రైనీలను తొలగించిన <<15417347>>తీరు<<>>, ఈ అంశం లేబర్ మినిస్ట్రీకి చేరడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కంపెనీ మూడో అటెంప్టు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.