News March 4, 2025

ఎమ్మెల్సీ కౌంటింగ్: రసవత్తర పోటీ

image

TG: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 6712, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 6676, ప్రసన్న హరికృష్ణ 5867, రవీందర్ సింగ్‌ 107, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైందన్నారు.

Similar News

News March 4, 2025

ప్చ్.. కోహ్లీ సెంచరీ మిస్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైనల్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కాస్త దూరంలో ఆగిపోయారు. 84 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43 ఓవర్లలో 226/5గా ఉంది. భారత్ విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ అవసరం. క్రీజులో కేఎల్ రాహుల్ (31*), హార్దిక్ పాండ్య (1*) క్రీజులో ఉన్నారు.

News March 4, 2025

Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

image

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్‌కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.

News March 4, 2025

శ్రీవారి ఆలయాలకు ఫ్రీగా స్థలం కేటాయించండి: TTD ఛైర్మన్

image

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని TTD ఛైర్మన్ BR నాయుడు కోరారు. CM చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు పలు రాష్ట్రాల CMలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ముఖ్యమన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు ఆలయాలది కీలక పాత్ర అని చెప్పారు.

error: Content is protected !!