News March 31, 2024

2 లక్షల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం: ICSI అధ్యక్షుడు నరసింహన్

image

కంపెనీ సెక్రటరీస్ కోర్సులు చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టిసారించినట్లు ICSI అధ్యక్షుడు నరసింహన్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో 72,000 మంది కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా 2047కు భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లుగా ఎదిగితే దేశానికి 2 లక్షల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2026

నేటి నుంచే IPL సమరం

image

వేసవిలో వినోదాన్ని పంచేందుకు IPL సిద్ధమైంది. నేటి నుంచి రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. నేడు జరిగే తొలిపోరులో SRH, RCB తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచులు జరగ్గా SRH 14, RCB 11 గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారీ హిట్టర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇవాళ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News March 28, 2026

కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

image

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.

News March 28, 2026

వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. నేడు అసెంబ్లీలో బిల్లు

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్‌ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, Dy.CM భట్టి 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.