News August 7, 2025

ఈవీఎం OR బ్యాలెట్.. ఏ పద్ధతి కావాలి?

image

ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. అంచనాలకు అందని విధంగా ఫలితాలు వస్తున్నాయని LoP రాహుల్ గాంధీ అంటున్నారు. EVMలు వద్దని, మళ్లీ బ్యాలెట్ పద్ధతి తేవాలని KTR ఇటీవల డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు BJP ఖండిస్తుండగా.. EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని EC కుండబద్దలు కొడుతోంది. ఓటర్లుగా మీరు ఏ విధానం కావాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News August 11, 2025

కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR

image

TG: కాంగ్రెస్ పాలనపై BRS నేత KTR ఫైరయ్యారు. CAG తాజా నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు. ‘6 గ్యారంటీలకు బదులు ఫెయిల్డ్ ఎకానమీని ఇచ్చారు. కాంగ్రెస్ చేతకానితనంతో రాష్ట్ర ఎకానమీ పతనమవుతోంది. తొలి క్వార్టర్‌లోనే రూ.10,583 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఒక్క రోడ్డు వేయకుండా, ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా, స్టూడెంట్స్‌కు సరైన తిండి పెట్టకుండానే రూ.20,266 కోట్ల అప్పు చేశారు’ అని Xలో దుయ్యబట్టారు.

News August 11, 2025

‘కూలీ’లో శివకార్తీకేయన్?

image

లోకేశ్ కనగరాజ్ సినిమాలు అనగానే యాక్షన్‌తో పాటు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రజినీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘కూలీ’లోనూ ఇలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రజినీ యంగ్ రోల్‌లో ‘అమరన్’ ఫేమ్ శివకార్తీకేయన్ కనిపిస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. లోకీ స్టైల్‌లో మాస్ రోల్‌లో ఈ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ నెల 14న సినిమా విడుదలయ్యాకే దీనిపై క్లారిటీ రానుంది.

News August 11, 2025

తగ్గిన బంగారం ధరలు

image

గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.760 తగ్గి రూ.1,02,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.700 పతనమై రూ.93,750 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.