News March 31, 2024
ముగిసిన టెన్త్ పరీక్షలు.. రేపటి నుంచి మూల్యాంకనం
AP: నిన్నటితో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 18న ప్రారంభమైన ఎగ్జామ్స్‌కు 6,18,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. సుమారు 50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి 25వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Similar News
News January 1, 2025
BGT: చివరి టెస్టుకు వర్షం ముప్పు
BGTలో భాగంగా సిడ్నీ వేదికగా ఎల్లుండి నుంచి జరిగే చివరి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ రద్దయినా, డ్రా అయినా ఆసీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిస్తే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండులో ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్‌లు జరగగా IND ఒక్కటే గెలిచింది. 5 ఓడిపోగా, 7 డ్రాగా ముగిశాయి.
News January 1, 2025
రాష్ట్రంలో మరో పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్
తెలంగాణలో వరుస పోలీసుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. HYD ఫిల్మ్ నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కిరణ్(36) మలక్ పేటలోని తన నివాసంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News January 1, 2025
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్-2బీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.