News August 10, 2025
ఆదివాసీలకు చదువు ఉచితం: చక్రపాణి

TG: ఆదివాసీ బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఉన్నత విద్యను అందించనున్నట్లు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి తెలిపారు. ‘ఆదివాసీలకు చదువును చేరువ చేయాలని ప్రణాళిక రూపొందించాం. ఉచితంగా చదువు చెప్తాం. గోండు, కోయ, చెంచు తదితర తెగల వారికి ఫీజు లేకుండా కేవలం రూ.500తోనే అడ్మిషన్, పుస్తకాలు అందిస్తాం’ అని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040-23680333, 23680555 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News August 14, 2025
రజినీకాంత్ ‘కూలీ’ పబ్లిక్ టాక్

భారీ అంచనాల మధ్య రజినీకాంత్ ‘కూలీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. USలో ప్రీమియర్లు చూసిన సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రజినీ మాస్ అండ్ పవర్‌ఫుల్ డైలాగులతో మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైరల్ అయిన పూజా హెగ్డే-సౌబిన్ షాహిర్ ‘మోనికా’ సాంగ్‌కు థియేటర్లలో పూనకాలేనని అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News August 14, 2025
నేడే పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నిక కౌంటింగ్

AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉ.8 గంటలకు ప్రారంభం కానుంది. భారీ బందోబస్తు నడుమ కడప శివారులోని ఉర్దూ నేషనల్ వర్సిటీలో లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందులలో 76శాతం, ఒంటిమిట్టలో 86శాతం పోలింగ్ నమోదైంది. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నా టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ పోటీ ఉండనుంది.
News August 14, 2025
రేపు పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు

AP: కేంద్రం ఆదేశాల మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై అవగాహన, పశుసంవర్ధక శాఖ తోడ్పాటుతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడంపై తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది.