News August 11, 2025
ఉమ్మడి కృష్ణాలో త్వరలో 2డిఫెన్స్ కేంద్రాలు

AP: ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. నాగాయలంక గొల్లలమొద వద్ద మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం నెలకొల్పుతామని PM ప్రకటించడం తెలిసిందే. అటు బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం కోసం జగ్గయ్యపేట జయంతిపురం ప్రాంతాన్ని డిఫెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ NHకు దగ్గర్లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అనుకూలమని భావిస్తున్నారు. ఇవి పట్టాలెక్కితే వేల మందికి ఉపాధి లభిస్తుంది.
Similar News
News August 11, 2025
ఇందులో నా తప్పులేదు: నిధి అగర్వాల్

AP: తాను ప్రభుత్వ వాహనంలో తిరగడంపై నెలకొన్న వివాదంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. ‘భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇది జరిగింది. స్థానిక నిర్వాహకులు నాకోసం కారును ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ వాహనమని నాకు తెలియదు. ఇందులో నా ప్రమేయం లేదు. ప్రభుత్వమే నాకు ఈ వాహన సదుపాయం కల్పించిందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. అభిమానులు నమ్మవద్దు’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
News August 11, 2025
HCAలో రూల్స్‌కు విరుద్ధంగా నియామకాలు: ఫహీమ్

TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కాంగ్రెస్ నేత MA ఫహీమ్ ఆరోపించారు. ఈ విషయంపై CID, విజిలెన్స్&ఎన్‌పోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘అర్హత లేకపోయినా కొందరిని సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఎన్పీ సింగ్, ఆకాశ్ బండారికి తప్ప ఛైర్‌పర్సన్‌తో సహా మరెవరికీ సరైన అర్హతలు లేవు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.
News August 11, 2025
జిల్లాల పేర్లు, హద్దుల మార్పుపై 13న జీవోఎం భేటీ: అనగాని

AP: జిల్లా, మండలాల పేర్లు, సరిహద్దుల మార్పుపై ఈనెల 13న GOM భేటీ కానుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘గత ప్రభుత్వం జిల్లాల పున:వ్యవస్థీకరణను అడ్డదిడ్డంగా చేసింది. వాటి సరిహద్దులు, పేర్లు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా అర్జీలుంటే ఇవ్వొచ్చు. వీటిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని వెల్లడించారు. GOMలో నారాయణ, అనిత, జనార్దన్, నిమ్మల, మనోహర్, సత్యకుమార్ ఉన్నారు.