News August 12, 2025

ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ APలోని ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అటు TGలోనూ HYD, KNR, MHBD, మహబూబ్ నగర్, NLG తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.

Similar News

News August 12, 2025

వామన్ రావు హత్యకేసు సీబీఐకి అప్పగించాలి: సుప్రీంకోర్టు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల <<6352207>>హత్య<<>> కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌ కిషన్ రావుకు భద్రత కల్పించాలని సూచించింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు.

News August 12, 2025

అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్!

image

అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత బిలియనీర్ ముకేశ్ అంబానీని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడి చేస్తే గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీని పేల్చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఖురాన్‌లోని ఓ వాక్యాన్ని ఉదహరిస్తూ అంబానీ ఫొటో చూపిస్తూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా మునీర్‌ బెదిరింపులకు భయపడేది లేదని ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ <<17370414>>కౌంటర్<<>> ఇచ్చింది.

News August 12, 2025

అలాంటి రోల్ చేయడం నచ్చలేదు: అనుపమ

image

‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తున్న సమయంలో తాను కంఫర్ట్‌గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. చాలా కాలం ఆలోచించాకే ఆ సినిమా ఒప్పుకొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో లిల్లీ పాత్ర చేయడం నచ్చలేదని, 100% కాన్ఫిడెన్స్‌గా కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే ‘యాటిట్యూడ్’ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె నటించిన ‘పరదా’ ఈ నెల 22న విడుదల కానుంది.