News April 1, 2024

SHOCKING: ఎక్కువ సేపు పనిచేస్తున్నారా?

image

ఇతర దేశాల్లోని ఐటీ నిపుణులతో పోల్చితే భారత ఉద్యోగులు పని పట్ల ఎంతో ప్రేమగా ఉంటారట. వీరు వారంలో జాతీయ సగటు (47.7 గంటలు) కంటే ఎక్కువగా 52.5 గంటలు పనిచేస్తున్నారు. KCCI సర్వే ప్రకారం 51% మంది భారతీయ టెక్కీలు 9-12 గంటలు పనిలో గడుపుతున్నట్లు తేలింది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల టెక్కీలు ఎసిడిటీ, వెన్ను & మెడ నొప్పి, నిద్రలేమి, కండరాలు పట్టుకోవడం, కంటి చూపు సమస్యలు, బరువు పెరుగుతున్నారని తెలిసింది.

Similar News

News October 6, 2024

PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం

image

తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

News October 6, 2024

రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News October 6, 2024

ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.