News April 11, 2024

క్రికెట్ ఔత్సాహికులకు గుడ్ న్యూస్

image

తెలంగాణ జిల్లాల్లోని పేద క్రికెట్ ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికోసం ప్రతి జిల్లా క్రికెట్‌ సంఘానికి రూ. 15 లక్షల నిధులిచ్చామన్నారు. ఈ నెల 15 నుంచి అప్లై చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 11, 2024

స్విగ్గీ బాయ్‌కాట్ నిర్ణయం వెనక్కి

image

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

News October 11, 2024

ఎన్‌కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

image

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

News October 11, 2024

మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

image

బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.