News April 15, 2024
కళ్యాణోత్సవం లైవ్‌కు అనుమతివ్వండి: మంత్రి సురేఖ
TG: భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు. కళ్యాణం లైవ్‌కు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. కాగా, ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, 18న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News November 17, 2024
మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ శివసేన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు చెప్పకపోవడంపై నిరాశ చెందినట్టు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయాన్ని వెల్లడించకుండా చంద్రచూడ్ కేవలం కామెంటేటర్‌గా మిగిలిపోయారని దుయ్యబట్టారు. జడ్జిగా కాకుండా న్యాయ విద్య లెక్చరర్‌గా చంద్రచూడ్ పని చేసి వుంటే మరింత పేరు సంపాదించేవారని వ్యంగ్యంగా విమర్శించారు.
News November 17, 2024
Trending: దేశంలో పుష్ప-2 మేనియా
భారత్‌లో ఆదివారం ఏం నడుస్తోంది అని ఎవరైనా ప్రశ్నిస్తే, పుష్ప-2 ట్రైలర్ నడుస్తోందని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. Xలో ఇదే ట్రెండింగ్‌లో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు మరో 3 రోజుల్లో జరుగుతున్నా రాజకీయ అంశాలను తలదన్ని పుష్ప క్రేజ్ నడుస్తోంది. తరువాత నయనతార-ధనుష్ వివాదం, కుంగువపై <<14634886>>జ్యోతిక<<>> స్పందన ట్రెండింగ్‌లో ఉన్నాయి.
News November 17, 2024
లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర: కేటీఆర్
TG: రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే ఈ మూసీ నిద్ర అని దుయ్యబట్టారు. హైడ్రాను మొదట స్వాగతించిన కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? అని Xలో ప్రశ్నించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుక మతలబేంటని, ఈ పాలి‘ట్రిక్స్’ను తెలంగాణ గమనిస్తోందని రాసుకొచ్చారు.