News April 21, 2024

పేరులో ‘స్వస్తిక’ ఉన్నందుకు మహిళపై ఉబర్ నిషేధం!

image

ఆస్ట్రేలియాలో ఉబర్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. స్వస్తిక చంద్ర అనే మహిళ గత ఏడాది అక్టోబరులో ఉబర్ ఈట్స్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆమె పేరును హిట్లర్ నాజీ సంకేతంగా భావించిన ఉబర్ మహిళ ఖాతాను నిషేధించింది. బాధితురాలు సుమారు 5 నెలల పాటు సంస్థతో పోరాడింది. అటు ఆస్ట్రేలియా హిందూ మండలి కూడా జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఉబర్ దిగొచ్చింది. స్వస్తికకు సారీ చెప్పి మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చింది.

Similar News

News November 19, 2024

ఉద్యోగులకు RSSతో అనుబంధం వద్దు.. తిరిగి నిషేధించాలని రాష్ట్రపతికి వినతి

image

ప్ర‌భుత్వ ఉద్యోగులు, సివిల్ స‌ర్వెంట్లు RSS కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌కుండా తిరిగి నిషేధం విధించాల‌ని రాష్ట్ర‌ప‌తిని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు అనుగుణంగా వివ‌క్ష లేని, నిష్పాక్షిక పాల‌నా వ్య‌వ‌స్థను నిర్వ‌హించేందుకు సివిల్ స‌ర్వీసెస్‌లో రాజ‌కీయ త‌ట‌స్థ వైఖ‌రిని కాపాడాల‌ని పేర్కొన్నారు. రాజకీయ సంస్థలతో వీరి అనుబంధం పౌర సేవల్లో నిష్పక్షపాతానికి ప్రమాదమంటూ లేఖ రాశారు.

News November 19, 2024

అస్సాం సీఎం కీలక నిర్ణయం

image

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును ‘శ్రీభూమి’గా మారుస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో ప్రకటించారు. 100ఏళ్ల క్రితం కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష, ఆశయాలను ప్రతిబింబిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

News November 19, 2024

Breaking: ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు

image

ఆస్కార్ విజేత AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ‘వారి బంధం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.