News May 14, 2024
జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు CBI కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు వెలువరించారు.
Similar News
News January 10, 2025
భార్య వైపు ఎందుకు తదేకంగా చూడకూడదు?: గుత్తా జ్వాల
వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మండిపడ్డారు. ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. భార్య వైపు భర్త ఎందుకు తదేకంగా చూడకూడదు? ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News January 10, 2025
FLASH: కేటీఆర్‌పై కేసు నమోదు
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-కార్ రేసు వ్యవహారంపై నిన్న ఏసీబీ అధికారులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
News January 10, 2025
స్పెలింగ్ ఎలా మర్చిపోతారు బ్రో!
లగ్జరీ బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌ను కాపీ చేస్తూ పేరులో స్పెలింగ్ మార్చి అమ్మేస్తుంటారు. అయితే, ఒరిజినల్ ప్రొడక్ట్ షాపు పేరులోనే స్పెలింగ్ తప్పుగా ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ PUMA షోరూమ్ పేరును PVMAగా ఏర్పాటుచేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది వినేందుకు హాస్యాస్పదంగా ఉన్నా.. సంస్థకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఫేక్ బ్రాండ్ అనుకొని కస్టమర్లు అటువైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు.