News May 16, 2024
VIRAL: హెల్మెట్ పెట్టుకొని కారు డ్రైవింగ్.. ఎందుకంటే?
UPలోని ఝాన్సీకి చెందిన బహదూర్ సింగ్ పరిహార్ ప్రతిరోజూ హెల్మెట్ పెట్టుకొని కారు నడుపుతున్నారు. అది కూడా ఆడీ కారు. ఇది చూసేవారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. రెండు నెలల క్రితం హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపాడనే కారణంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ.1000 ఫైన్ వేశారు. ఇదేంటని అడిగితే ఎన్నికలయ్యాక చూద్దామన్నారట. దీంతో మరోసారి ఫైన్ పడుతుందేమోనని భయంతో హెల్మెట్ పెట్టుకొని కారు నడుపుతున్నారు.
Similar News
News January 11, 2025
చైనా మాంజా.. IPSకు తప్పిన ప్రమాదం!
చైనా మాంజా వినియోగించడం వల్ల వాహనదారులకు గాయాలవుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన IPS అధికారి రమేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ‘దేవరా! ఇది నాకు చుట్టమల్లే చుట్టేయలేదు. శత్రువల్లే కాటేయబోయింది. ఈ రోజు ఉదయం నాకు తృటిలో ప్రమాదం తప్పింది. కాలికి మెడకు ఒకే సమయంలో చుట్టేసే మాంజా సమయానికి నా కంటబడింది. పతంగుల పండుగ సందర్భంగా తెగిన గాలి పటాల తాలూకు దారం మీ కంటపడగానే, చుట్టేయండి’ అని సూచించారు.
News January 11, 2025
రూ.10 లక్షలతో బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్
AP: విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో Dy.CM పవన్ కళ్యాణ్ రూ.10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువగా డిక్షనరీలు తీసుకున్నారు. బుక్ ఫెయిర్‌లోని ‘ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకం ఎన్ని ఉంటే అన్ని ఆర్డర్ చేశారు. ఈ పుస్తకాలతో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
News January 11, 2025
భాగ్యనగరం బోసి‘పోతోంది’!
పండగకు నగరవాసులందరూ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతుండటంతో భాగ్యనగరం బోసిపోయింది. జనంతో కళకళలాడే రోడ్లు విదేశాల్లో రోడ్లలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా గడిస్తే పండుగకు వెళ్లేవారంతా వెళ్లిపోగా, హైదరాబాద్ రహదారులు మరింత నిర్మానుష్యంగా మారొచ్చని అంచనా. ప్రశాంతంగా ఉందని కొంతమంది అంటుంటే.. జనం లేక బోరింగ్‌గా కనిపిస్తోందని మరికొంతమంది పేర్కొంటున్నారు. మీ కామెంట్?