News May 22, 2024
నలుగురిని ఢీ కొట్టిన మైనర్
పుణేలో ఓ 17ఏళ్ల బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరిని బలిగొన్న ఘటన మరువక ముందే మరో బాలుడు(15) నలుగురిని గాయపరిచాడు. UPలోని కాన్పూర్‌లో ఓ పేరొందిన డాక్టర్ కుమారుడి డ్రైవింగ్ వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఇదే బాలుడు గతేడాది తన డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమయ్యాడు. తాజా ఘటనతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోమ్‌కి తరలించారు. రెండు ఘటనల్లోనూ బాలుడి తండ్రిపై కేసు నమోదు చేశారు.
Similar News
News January 12, 2025
వారికి రైతు భరోసా ఇవ్వం: మంత్రి పొంగులేటి
TG: రైతు భరోసా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగ్యమైన భూమి ఉన్నవారికి పథకం అమలు చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యలకులోను కావొద్దన్నారు. అర్హులను గుర్తించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని తెలిపారు.
News January 12, 2025
మాంజాపై నిషేధాన్ని అమలు చేయండి: హైకోర్టు
TG: గాలిపటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటి విక్రయాన్ని నిషేధిస్తూ 2017లో NGT ప్రధాన బెంచ్ వెల్లడించిన తీర్పును అమలు చేయాలని పేర్కొంది. ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలని హోం, అటవీ, పర్యావరణ శాఖల సీఎస్‌లకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
News January 12, 2025
రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది
TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.