News June 2, 2024

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకి కేజ్రీవాల్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ జైల్లో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిహార్ జైలుకు వెళ్తారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ గడువు ఇవాళ్టితో ముగిసింది. మరోవైపు ఢిల్లీ కోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు జూన్ 5న రానుంది.

Similar News

News January 21, 2025

కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు

image

AP: రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తిదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.

News January 21, 2025

పిల్లి చేసిన పనికి ఉద్యోగం పోయిందిగా..!

image

ఏంటి షాక్ అయ్యారా? చైనాకు చెందిన ఓ యువతికి ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఎదురైంది. ఆ యువతి తన రాజీనామా లేఖను డ్రాఫ్ట్‌లో ఉంచింది. అయితే, ల్యాప్‌టాప్‌ను వదిలేసి వెళ్లగా అనుకోకుండా పెంపుడు పిల్లి కీబోర్డ్‌ ఎంటర్ బటన్ మీద దూకింది. దీంతో ఆ మెయిల్ యువతి బాస్‌కు చేరడంతో ఉద్యోగంతో పాటు ఇయర్ ఎండ్ బోనస్‌ను కోల్పోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డవగా, ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

News January 21, 2025

నీరజ్ చోప్రాకు కట్నం ఎంత ఇచ్చారంటే..?

image

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఇటీవల టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కట్నంగా తన అత్తమామల నుంచి నీరజ్ ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. అలాగే ఎలాంటి ఖరీదైన బహుమతులు, వస్తువులు, దుస్తులు కూడా ఆయన స్వీకరించలేదని హిమానీ తల్లిదండ్రులు తెలిపారు. దేవుడి దయ వల్ల తమ అమ్మాయికి దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో పెళ్లి కావడం సంతోషంగా ఉందన్నారు.