News June 4, 2024
ఆయన ఇటు.. ఈయన అటు
TG: రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. 2019లో మెదక్ ఎంపీగా గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS) 2023లో దుబ్బాక అసెంబ్లీకి పోటీ చేసి నెగ్గారు. ఇప్పుడు దుబ్బాకలో ఆయన చేతిలో ఓడిన రఘునందన్‌రావు ఈ ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఈ గెలుపోటములతో ఆయన స్థానం ఈయనకు, ఈయన స్థానం ఆయనకు దక్కినట్లయింది.
Similar News
News November 30, 2024
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి
TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
News November 30, 2024
బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య బీమా?
APలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందుతోంది. వీరికి ఆరోగ్య బీమా పథకాన్ని(EHS) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కోసం ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఉద్యోగి దాదాపు ₹7వేలు చెల్లిస్తున్నారు. అయితే రెండు జాతీయ బ్యాంకుల ప్రీమియం ₹2,500 మాత్రమే ఉంది. దీంతో ఈ విధానం అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
News November 30, 2024
GOOD NEWS.. రూ.2 లక్షల రుణమాఫీ!
రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు శుభవార్త. నేడు పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో CM రేవంత్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3వేల కోట్లు విడుదల చేయనుంది. DEC మొదటి వారంలో జీతాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ కాగా.. పలు కారణాలతో 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదు.