News June 5, 2024
చట్టసభలకు మాజీ సివిల్ సర్వెంట్లు
AP: NDA తరఫున పోటీచేసిన నలుగురు మాజీ బ్యూరోక్రాట్లు చట్టసభల్లో తమ గళం వినిపించనున్నారు. బాపట్ల(SC) లోక్‌సభ స్థానంలో మాజీ IPS తెన్నేటి కృష్ణప్రసాద్ గెలుపొందారు. చిత్తూరు MP స్థానంలో మాజీ IRS అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్ నెగ్గారు. అంబేడ్కర్ కోనసీమ(D) రాజోలు(SC)లో జనసేన అభ్యర్థి విశ్రాంత IAS అధికారి దేవ వరప్రసాద్, పల్నాడు జిల్లా ప్రత్తిపాడు(SC)లో మాజీ IAS బూర్ల రామాంజనేయులు MLAలుగా విజయం సాధించారు.
Similar News
News November 28, 2024
బంగ్లాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరం: ప్రియాంక
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై MP ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్కాన్ గురు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, హిందూ మైనార్టీలపై దాడులు తీవ్ర ఆందోళనకరమని ఆమె అన్నారు. ఈ విషయాలపై బంగ్లా ప్రభుత్వం ఎదుట కేంద్ర సర్కారు తన స్వరం గట్టిగా వినిపించాలని కోరారు. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో చిన్మయ్‌ను అరెస్ట్ చేయగా, ఆయన్ను విడుదల చేయాలని అక్కడి హిందువులు నిరసనలు చేపట్టారు.
News November 28, 2024
టీచర్ల సెలవులపై ఆంక్షలు.. ఎత్తేయాలని డిమాండ్
AP: ఓ స్కూల్ లేదా మండలంలోని మొత్తం స్టాఫ్‌లో గరిష్ఠంగా 7-10 శాతం మంది టీచర్లు మాత్రమే సెలవులు వాడుకోవాలని విద్యాశాఖ షరతులు విధించింది. దీనిపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మండిపడింది. టీచర్లు అత్యవసర, ఆరోగ్య కారణాలతో తమ సాధారణ సెలవులను వినియోగించుకోవడంపై ఆంక్షలు తగవని పేర్కొంది. లీవ్స్‌పై పరిమితిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
News November 28, 2024
మూడేళ్లలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా TG: న్యాబ్
TG: వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇందుకోసం త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’ను తయారు చేస్తామన్నారు. డ్రగ్స్ నివారణపై పలు వర్సిటీలు, కాలేజీల సిబ్బందికి అవగాహన కల్పించారు. మార్కెట్‌లోకి రోజుకో కొత్త రకం డ్రగ్ వస్తోందని, నిటాజిన్ అనే డ్రగ్ ఒక్క గ్రాము 40 కిలోల ఓపీఎంతో సమానమని పేర్కొన్నారు.