News July 1, 2024

పాకిస్థాన్‌ను గడగడలాడించిన అబ్దుల్ హమీద్‌కు షా నివాళులు

image

‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీత వీర్ అబ్దుల్ హమీద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా 1965 భారత్ -పాక్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఘటనను హోం మంత్రి గుర్తుచేసుకున్నారు. ఈ యుద్ధంలో శత్రువులకు చెందిన 7 యుద్ధ ట్యాంకులను హమీద్ ఒంటిచేత్తో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు.

Similar News

News July 5, 2024

లావణ్య ఫిర్యాదుపై స్పందించిన హీరో రాజ్‌ తరుణ్

image

ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న <<13569817>>ఆరోపణల్లో<<>> నిజం లేదని హీరో రాజ్ తరుణ్ తెలిపారు. ‘లావణ్యతో రిలేషన్‌లో ఉన్నమాట వాస్తవమే. కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకే దూరం పెట్టాను. ఆమెకు నా డబ్బు కావాలి. అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్నతండ్రిని కూడా మోసం చేసింది’ అని మీడియాతో చెప్పారు.

News July 5, 2024

టీడీపీలో చేరిన చిత్తూరు మేయర్, డిప్యూటీ మేయర్

image

AP: చిత్తూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 46 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. ప్రస్తుత చేరికలతో సంఖ్యా బలం మారుతోంది.

News July 5, 2024

నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన

image

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు NBEMS ప్రకటించింది. రెండు షిప్టుల్లో పరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలకు https://natboard.edu.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.