News July 20, 2024
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.350 తగ్గి రూ.67,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.380 తగ్గి రూ.73,970కి చేరింది. వెండి ధర కేజీ రూ.1,750 తగ్గడంతో ప్రస్తుతం రూ.96,000 పలుకుతోంది.
Similar News
News January 24, 2025
భారత భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ: బ్రాడ్ హగ్
భారత T20 జట్టుకు భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నారు. అతని బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. తిలక్ వర్మ స్మార్ట్ క్రికెటర్ అని, అతని క్రికెట్ బ్రెయిన్ సూపర్ అన్నారు. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతారని తెలిపారు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌పై T20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తిలక్ ఇప్పటి వరకు 21మ్యాచులు ఆడి 635 రన్స్ చేశారు.
News January 24, 2025
జనవరి 24: చరిత్రలో ఈరోజు
1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం
News January 24, 2025
భారతీయులకు బిగ్ రిలీఫ్
అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లైంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్‌తో పాటు USAకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే.