News July 22, 2024
పద్మశ్రీ గ్రహీతలకు రూ.25వేల పింఛన్.. జీవో జారీ
TG: ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతి నెలా రూ.25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 25, 2025
మీర్‌పేట ఘటన.. మరిన్ని విషయాలు
TG: మీర్‌పేటలో భార్యను <<15227723>>చంపి<<>> ఉడికించిన ఘటనకు ముందు భార్యభర్తలు సినిమాకు వెళ్లొచ్చారు. ఆపై ఊరెళ్లే విషయంలో గొడవపడి భార్యను గురుమూర్తి చంపేశాడు. వారి స్వగ్రామమైన ప్రకాశం(D) JPచెరువులో భర్తకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో గొడవ జరగ్గా, అప్పట్నుంచి ఊరెళ్లడం లేదు. భార్య చనిపోయాక పిల్లలను చూసుకునేందుకు తెలిసిన అమ్మాయైతే(ప్రేయసి) మంచిదనే సెంటిమెంట్‌తో ఆమెను పెళ్లి చేసుకోవాలని గురుమూర్తి ప్లాన్ వేశాడు.
News January 25, 2025
తిరుమలలో ఫిబ్రవరి 4న VIP బ్రేక్ దర్శనాలు రద్దు
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. 9కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 57,655 మంది దర్శించుకోగా 20,051 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.73కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే 3-5 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపేశారు.
News January 25, 2025
ఐదు రోజుల అనంతరం ముగిసిన ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇవాళ తెల్లవారుజాము వరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గత 5 రోజుల నుంచి SVC ప్రొడక్షన్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, మ్యాంగో మీడియా ఓనర్ ఇళ్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు.