News August 22, 2024
నేటి నుంచి RRR దక్షిణభాగం భూసేకరణ
TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) దక్షిణ భాగం భూసేకరణను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఉత్తర భాగం భూసేకరణను వచ్చే నెల 15నాటికి పూర్తి చేస్తామని ఆర్అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘రైతులకు ఇబ్బంది లేకుండా పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మున్ముందు సమస్యలు రాకుండా ఉండేందుకు కన్సల్టెంట్‌ను నియమిస్తాం. రింగ్ రోడ్డుకు అనుసంధానంగా 16 రేడియల్ రోడ్లను నిర్మిస్తాం’ అని తెలిపారు.
Similar News
News January 27, 2025
TTD Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,466 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు తెలిపారు.
News January 27, 2025
మాట విన్లేదు.. ప్రతీకారంతో టారిఫ్స్ పెంచేసిన ట్రంప్
కొలంబియాపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపించారు. అక్రమ వలసదారులను తీసుకెళ్లిన 2 విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారంగా 25% టారిఫ్స్ పెంచేశారు. ఆ దేశ పౌరులపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించారు. వారి మద్దతుదారులు సహా అధికారుల వీసాలను రద్దు చేశారు. ‘కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోకు మంచిపేరు లేదు. విమానాలను అడ్డుకొని US భద్రతను ఆయన సందిగ్ధంలో పడేశారు’ అని అన్నారు.
News January 27, 2025
ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన UCC
దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలులోకి వచ్చింది. రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘యూసీసీతో సమాజంలో అనేక విషయాల్లో అసమానతలు తొలగుతాయి. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా.. ఇది ఏకాభిప్రాయం లేని ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.