News November 19, 2024
రష్యా VS ఉక్రెయిన్: వెయ్యి రోజుల వినాశనం విలువెంతంటే?
రష్యా, ఉక్రెయిన్ వివాదం మొదలై నేటికి 1000 రోజులు. WW II తర్వాత అత్యంత వినాశకర యుద్ధం ఇదేనని విశ్లేషకుల అంచనా. రెండువైపులా 10లక్షలకు పైగా మరణించారని సమాచారం. ఉక్రెయిన్‌లో ఐదో వంతు అంటే గ్రీస్‌తో సమానమైన భూభాగాన్ని రష్యా అధీనంలోకి తీసుకుంది. 2022తో పోలిస్తే ఆ దేశ ఎకానమీ 33% పడిపోయింది. మొత్తంగా $152 బిలియన్లు నష్టపోయింది. ఒకప్పటిలా మౌలిక సదుపాయాలు నిర్మించాలంటే $485 బిలియన్లు అవసరమని WB అంచనా.
Similar News
News November 19, 2024
ఆ బ్యాంకుల్లో వాటాలు విక్రయించనున్న కేంద్రం?
ప్రభుత్వ రంగ బ్యాంకులైన CBI, IOB, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో వాటాలు విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది! దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. కేంద్ర కేబినెట్ ఆమోదానికి త్వరలో ప్రతిపాదనలు పంపనుంది. OFS సేల్ కింద వాటాలు విక్రయించనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ షేర్లలో పబ్లిక్ పర్సంటేజ్ నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
News November 19, 2024
అణ్వాయుధాల వాడకానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్
తమపై ఎవరైనా దాడికి దిగినట్లైతే అణ్వాయుధాలను విస్తృతంగా వాడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తైన సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చేందుకు US తాజాగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని పుతిన్ వ్యతిరేకిస్తున్నారు. అందుకు తగిన బదులిచ్చేందుకే ఆయన అణ్వాయుధాల వాడకానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News November 19, 2024
PSU, CPSE ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్
PSU, CPSE షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా? అయితే మీకో శుభవార్త! ఈ ఇన్వెస్టర్లకు నిలకడగా రాబడి అందించేందుకు ప్రభుత్వం సరికొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. ఇకపై ఏటా పన్నేతర ఆదాయంలో 30% లేదా కంపెనీ నెట్‌వర్త్‌లో 4% విలువకు సమానంగా డివిడెండ్ ఇవ్వాలని ఆదేశించింది. వరుసగా 6 నెలలు షేర్ల ధర బుక్‌వ్యాలూ కన్నా తక్కువగా ఉండి, కంపెనీ నెట్‌వర్త్ రూ.3000CR, నగదు రూ.1500CR ఉంటే బయ్‌బ్యాక్ చేయొచ్చని తెలిపింది.