News June 9, 2024
రేవ్ పార్టీ కేసు.. స్నిఫర్ డాగ్స్‌కి సన్మానం
సినీ ప్రముఖులు పాల్గొన్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్‌ను పట్టించిన స్నిఫర్ డాగ్స్‌కు పోలీసులు సన్మానం చేశారు. హెబ్బాగోడిలో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌హౌస్‌లో మే 19న ఈ పార్టీ జరిగింది. దీనిని భగ్నం చేసిన పోలీసులు డాగ్స్‌ని రంగంలోకి దింపారు. అవి ఆ వాసన పసిగట్టి చెట్ల పొదల్లో దాచిన డ్రగ్స్‌ను కనిపెట్టాయి. దీంతో వాటిని ఇవాళ ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News January 12, 2025
SBI SCO అడ్మిట్ కార్డులు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ కోసం అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది. జనవరి 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు జనవరి 17 నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1497 ఉద్యోగాలను SBI భర్తీ చేస్తోంది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <
News January 12, 2025
70, 90 గంటలు కాదు.. వర్క్ క్వాలిటీ ముఖ్యం: ఆనంద్ మహీంద్రా
పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. వారిపై తనకు గౌరవం ఉందంటూనే పని గంటలపై కాకుండా వర్క్ క్వాలిటీపై దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. 70, 90 గంటల కంటే నాణ్యమైన పని 10 గంటలు చేస్తే ప్రపంచాన్ని మార్చేయవచ్చన్నారు. పలు దేశాలు వారంలో నాలుగు రోజుల వర్క్ కల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
News January 12, 2025
రాత్రుళ్లు రీల్స్ చూస్తున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
నిద్రపోకుండా బెడ్‌పైనే గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? ఇది మీకోసమే. రాత్రుళ్లు స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. యువకులు, మధ్య వయస్కుల్లో వచ్చే హైబీపీ నిద్రవేళలో చూసే రీల్స్‌తో ముడిపడి ఉన్నట్లు తేలింది. బెడ్ టైమ్‌లో 4 గంటల కంటే ఎక్కువ సమయం రీల్స్ చూసేవారికి ప్రమాదం ఎక్కువని వెల్లడైంది. కాబట్టి పడుకునేటప్పుడు రీల్స్ చూడటం తగ్గించాలని వైద్యులు సూచించారు.