News May 25, 2024
వైస్ కెప్టెన్సీకి నో చెప్పిన అఫ్రీది
PAK వైస్ కెప్టెన్‌గా వ్యవహరించేందుకు బౌలర్ షాహీన్ అఫ్రీది నిరాకరించారు. T20 WCలో తాను బాబర్‌కు డిప్యూటీగా ఉండనని చెప్పారు. గత ఏడాది వన్డే WCలో ఓటమితో కెప్టెన్‌గా బాబర్‌ను PCB తప్పించింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌కు షాహీన్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఆ సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడటంతో తాజాగా బాబర్‌కు పగ్గాలు అప్పగించింది. దీంతో పీసీబీపై ఆగ్రహంతోనే అఫ్రీది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 29, 2024
నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?
TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 29, 2024
జనవరి 1న సెలవు లేదు
జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.
News December 29, 2024
హైదరాబాద్‌లో మన్మోహన్ విగ్రహం?
TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదే విధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది.