News April 25, 2024

లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి: ACB

image

TG: ACB డీజీ CV ఆనంద్ ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్‌ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. లేదా dgacb@telangana.gov.inకి మెయిల్ చేయాలన్నారు.

News April 25, 2024

ఓటమికి కారణం అదే: రుతురాజ్ గైక్వాడ్

image

మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్‌తోనే తాము మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘ఈ మ్యాచ్ బాగా సాగింది. 13-14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉండటంతో మా స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరకలేదు. అందుకే ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది. మేము మరో 20 పరుగులు చేయాల్సింది. లక్నో టీమ్ గొప్పగా ఆడింది’ అని రుతురాజ్ తెలిపారు.

News April 25, 2024

WAY2NEWS యాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

image

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు నాంపల్లిలో విద్యాశాఖ కార్యదర్శి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWS యాప్‌లో మీ ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా ఒక్క క్లిక్‌తో దీన్ని షేర్ చేయొచ్చు.
#Be Ready

News April 25, 2024

సచిన్ టెండూల్కర్ రికార్డుల్లో కొన్ని..!

image

నేడు సచిన్ టెండూల్కర్ 51వ జన్మదినం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన సాధించిన కొన్ని రికార్డులు..
* 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.
* అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు(34,357).
* వన్డేల్లో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు(1894).
* అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు(76).
* అత్యధిక అర్ధ శతకాలు(264), అత్యధిక ఫోర్లు(4076).
* టెస్టుల్లో వేగంగా 15వేల పరుగులు, వన్డేల్లో వేగంగా 18వేల పరుగులు.

News April 25, 2024

ఓటేస్తే ఫ్రీగా ఐస్‌క్రీమ్, జిలేబీ!

image

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఆహార దుకాణాల యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్‌క్రీమ్, అటుకుల ఉప్మా ఫ్రీగా అందిస్తామని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌తో సమావేశం అనంతరం దుకాణదారుల సంఘం మీడియాకు తెలిపింది. ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News April 25, 2024

నిడదవోలు: గెలుపు ముంగిట నిలిచేదెవరు?

image

AP: కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు(తూర్పుగోదావరి) 2008లో కొత్త సెగ్మెంట్‌గా ఏర్పడింది. 2009, 14లో బూరుగుపల్లి శేషారావు(TDP), 2019లో శ్రీనివాసనాయుడు(YCP) గెలిచారు. ఈసారి కూడా YCP నుంచి ఆయనే బరిలో దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2019లో YCPకి 81వేల ఓట్లు రాగా, TDP, JSPకి కలిపి 82,386 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. కవితకు బెయిల్ ఇవ్వాలని నిన్న ఆమె తరఫు న్యాయవాది రాణా వాదనలు వినిపించగా.. కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.

News April 25, 2024

4.5 కిలోల బాల భీముడు జననం

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుష్పలత (36) అనే మహిళకు 4.5 కిలోల మగ బిడ్డ జన్మించాడు. ఇది ఆమెకు మూడవ కాన్పు కాగా ఆపరేషన్ లేకుండా జన్మించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా పుట్టిన బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 3 కిలోల మధ్య ఉంటుంది.

News April 25, 2024

నేడు పాలిసెట్ గ్రాండ్ టెస్ట్

image

AP: పాలిసెట్-2024కు సన్నాహకంగా నేడు పాలిసెట్ గ్రాండ్ టెస్టును నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ‘పాలిసెట్ కోసం ఈ నెల 1 నుంచి ఉచిత శిక్షణ అందించాం. దానికి ముగింపుగా ఈ టెస్టును నిర్వహిస్తాం. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 7273మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 12513మంది విద్యార్థులు శిక్షణ పొందారు. శిక్షణ కేంద్రాల్లోనే ఉచితంగా టెస్టును నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.

News April 25, 2024

నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లోని 46 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు 143 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇటు రైల్వే శాఖను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రయాణికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.. తాగునీరు, వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.