News April 24, 2024

KCR పాలనలో పాలమూరుకు అన్యాయం: రేవంత్

image

TG: కేసీఆర్ హయాంలో పాలమూరు గడ్డకు చాలా అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లిలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో మాట్లాడిన ఆయన.. ‘కరీంనగర్‌లో ఓటమి భయంతో కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి జిల్లాకు అన్యాయం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కరవు జిల్లాను కనీసం పట్టించుకోలేదు’ అని ఫైరయ్యారు.

News April 24, 2024

కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ: KCR

image

TG: ‘కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. దీనిని ఎవ్వరూ తుడిచివేయలేరని చెప్పారు. తనను తగ్గించే ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడ్డారన్నారు. కాంగ్రెస్, బీజేపీవి వికృత రాజకీయ క్రీడలని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తనపై విషం చిమ్మారని దుయ్యబట్టారు. దీనిని సమాజం అంతా చూస్తోందన్నారు.

News April 24, 2024

రాష్ట్రంలో రూ.155 కోట్లు స్వాధీనం

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో రూ.61.77 కోట్ల నగదు, రూ.19.16 కోట్లు విలువ చేసే నగలు, రూ.28.92 కోట్ల విలువైన మద్యంతో పాటు రూ.23.87 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన ఇతర వస్తువులను ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 24, 2024

TRSను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది నిజమే: KCR

image

TRS పార్టీని అప్పట్లో కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది వాస్తవమేనని, అయితే ఆ మాటను కాంగ్రెస్ వినలేదని కేసీఆర్ అన్నారు. ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అది కరెక్ట్ కాదని, వద్దని నేను చెప్పినా వాళ్లు వినలేదు. దీంతో విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. ఆ తర్వాత మేం ఇండిపెండెంట్‌గా నిల్చొని గెలిచాం’ అని కేసీఆర్ అన్నారు.

News April 24, 2024

చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు

image

AP: చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా సిఫార్సు చేశారు. బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు చేయగా.. చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని సీఈవో మీనా.. తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. CBN ప్రసంగాల క్లిప్పింగ్‌లను జత పరిచారు.

News April 24, 2024

‘పుష్ప2’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్

image

అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప’ టీమ్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘పుష్ప2’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రేపు సాయంత్రం 04.05గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ చిత్రం 2024 ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 24, 2024

BRSకు డిపాజిట్లు గల్లంతు: కోమటిరెడ్డి

image

TG: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ కథ ముగిసింది. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదు. బీజేపీ 2 లేదా 3 సీట్లు గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ 14 సీట్లలో గెలవబోతుంది. బీఆర్ఎస్ నేతలు మొదట కల్వకుంట్ల కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుంది’ అని ఆయన ఎద్దేవా చేశారు.

News April 24, 2024

ధోనీని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు: రైనా

image

సీఎస్కే మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2014లో పంజాబ్ చేతిలో క్వాలిఫయర్-2లో ఓటమి తర్వాత ధోనీ చాలా కోపంగా కనిపించారని చెప్పారు. మిస్టర్ కూల్‌ని అలా ఎప్పుడూ చూడలేదని గుర్తు చేసుకున్నారు. చివరి వరకు క్రీజులో(31 బంతుల్లో 42*) ఉన్నా గెలిపించకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్‌లు, హెల్మెట్‌ని విసిరేశాడని చెప్పారు. కాగా ఈ మ్యాచులో రైనా 25 బంతుల్లోనే 87 పరుగులు చేశారు.

News April 24, 2024

రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర

image

AP: గత నెల 27న ప్రారంభమైన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటితో ముగియనుంది. రేపు ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి బయల్దేరి.. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాళి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. అనంతరం అక్కవరం బహిరంగ సభలో జగన్ ప్రసంగం అనంతరం ఈ యాత్ర ముగియనుంది. ఆ తర్వాత సీఎం తాడేపల్లికి బయల్దేరి వెళ్లనున్నారు.

News April 24, 2024

హైదరాబాద్ వస్తున్నాం: ఆర్సీబీ

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ నెల 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ‘అందరికీ నమస్కారం. హైదరాబాద్ వస్తున్నాం’ అంటూ RCB ట్వీట్ చేసింది. ‘ఫామ్‌లో ఉన్న ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కొత్తగా లభించిన కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతాం’ అంటూ ప్లేయర్ల ఫొటోలను జత చేసింది. ఇటీవల KKRపై గెలుపు అంచులదాకా వచ్చి ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడిన విషయం తెలిసిందే.