India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ ఆస్తులను దోచేసి వాటిని కొందరికి పంచాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. వారి హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైపోయింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల గురించి బయటపెట్టాను. దీంతో కాంగెస్, ఇండియా కూటమి నన్ను దూషించడం మొదలుపెట్టాయి’ అని రాజస్థాన్‌లోని టోంక్ సభలో పేర్కొన్నారు. ఇటీవల బన్‌స్వారా పర్యటనలోనూ మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలతో CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, వైసీపీ.. కార్మికులకు అండగా నిలుస్తాయని జగన్ భరోసానిచ్చారు. కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే మొదట గళమెత్తిందని, ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఇప్పుడు జట్టుకట్టాయని, కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి ఉందని వ్యాఖ్యానించారు.
AP: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్‌కు నామమాత్రపు ఫీజును నేటి నుంచి ఈ నెల 30లోపు స్కూళ్ల లాగిన్ ద్వారా చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుముతో మే 23 వరకు చెల్లించవచ్చు. అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1,000 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఛాన్స్ ఉంటుంది.
TG: కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం నాకు ఓ ధోరణి. తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణే అందుకు కారణం కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి అధికారపక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమో తెలియదు. అయితే నేను గెలిపించడానికి పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యతను సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆమె తెలిపారు.
ట్విటర్ అధినేత మస్క్‌పై ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడ్నీలో బిషప్‌పై దాడికి సంబంధించిన పోస్టుల్ని చూపించొద్దని ఆ దేశ కోర్టు ట్విటర్‌ను ఆదేశించింది. దీంతో ఆస్ట్రేలియాలో పోస్టుల్ని ఆపేసిన ట్విటర్, ప్రపంచవ్యాప్తంగా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఆల్బనీస్ మండిపడ్డారు. ‘ఈ పొగరుబోతు కోటీశ్వరుడు తాను చట్టానికి అతీతుడినని అనుకుంటున్నాడు. మేమేం చేయాలో అది చేస్తాం’ అని హెచ్చరించారు.
దేశంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఏపీలో ఉంది. శ్రీకాకుళం జిల్లా మడపంలో 176 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చు చేశారు. బిదనగెరె (కర్ణాటక) 161 అడుగులు, పరిటాల (ఏపీ) 135, ఒడిశాలోని దమంజోడి హనుమాన్ 108.9, సిమ్లాలోని జాఖూ హిల్ హనుమాన్ 108, ఢిల్లీలోని శ్రీ సంకట్ మోచన్ హునుమాన్ 108 అడుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మలయాళం డైరెక్టర్ జోషి ఇంట్లో చోరీకి పాల్పడి పట్టుబడిన బిహార్ ‘రాబిన్‌హుడ్’ ఇర్ఫాన్ (34) స్టోరీ చర్చనీయాంశమైంది. ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నాయి. బిహార్‌లోని గర్హ జోగియాకు చెందిన ఇర్ఫాన్, దోచిన సొమ్మును చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసేవాడట. కొచ్చిలో అది డైరెక్టర్ ఇల్లు అని తెలియక రూ.కోటి విలువైన ఆభరణాలు కాజేశాడట. కాగా జోషి సైతం గతంలో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమా తీయడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థులుగా నిలుస్తున్నారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,598.65 కోట్లతో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ₹4,568 కోట్లు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ₹715.62 కోట్లు, కడప కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ₹182 కోట్లతో ఉన్నారు.
నిన్న MIపై సెంచరీతో చెలరేగిన RR ప్లేయర్ జైస్వాల్ IPL హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 23 ఏళ్ల వయసు లోపు(22Y 116D) రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇతను గత ఏడాది MIపైనే తొలి సెంచరీ బాదారు. తక్కువ ఏజ్‌లో రెండు సెంచరీలు కొట్టిన వారి జాబితాలో గిల్(23Y 255D), శాంసన్(24Y 138D), వార్నర్(25Y 196D), కోహ్లీ(27Y 184D) ఉన్నారు.
AP: తూ.గో జిల్లా తిరుగుడుమెట్టకు చెందిన చంద్రశేఖర్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిన్న విడుదలైన టెన్త్ ఫలితాల్లో చంద్రశేఖర్ 513 మార్కులు సాధించాడు. ఈ సంతోష సమయంలో మిత్రుడు తమతో లేకపోవడంతో స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విద్యార్థిని కోల్పోయామంటూ ఉపాధ్యాయులు అతడిని గుర్తు చేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.