News April 24, 2024

ముంబైకి అండగా తిలక్ వర్మ

image

ముంబై ఇండియన్స్ టీమ్‌కు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అండగా నిలుస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలుపుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా 25, 64, 32, 6, 16*, 31, 34*, 65 రన్స్ చేసిన 21 ఏళ్ల వర్మ.. ముంబైకి బ్యాక్ బోన్‌గా మారారు. బ్యాటింగ్‌లో మంచి టచ్‌లో ఉన్న తిలక్‌ను T20WC కోసం భారత జట్టుకు ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

News April 24, 2024

సర్వేల ప్రకారం BRSకు 8-10 సీట్లు: KTR

image

ఈ LS ఎన్నికల్లో BRS 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్, BJP ప్రభుత్వాల మోసాలను సైతం వెలుగులోకి తేవాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 24, 2024

రాణించిన సందీప్ శర్మ.. ముంబై 179/9

image

IPL: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో 20ఓవర్లలో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(0)తో పాటు సూర్య కుమార్(10), హార్దిక్(10) విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ(65), వధేరా(49) రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ(5), బౌల్ట్(2) వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు.

News April 24, 2024

సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

image

AP: CM జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. 21వ రోజు యాత్రలో భాగంగా ఎంవీవీ సిటీ నుంచి రేపు ఉ.9 గంటలకు బయల్దేరి మధురవాడ, ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో CM భేటీ అవుతారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ, బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు.

News April 24, 2024

ALERT: ఆ సమయంలో ఇంట్లోనే ఉండండి

image

AP: రాష్ట్రంలో రేపు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు 43 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 104 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ప్రాంతాలవారీగా వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 24, 2024

ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధం.. బీజేపీ నుంచి బహిష్కరణ

image

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్పను ఆ పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తన కొడుక్కి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై శివమొగ్గ నుంచి పోటీకి సిద్ధమయ్యారు.

News April 24, 2024

మనిషికి, ఏఐకు యుద్ధవిమాన పోటీ.. నిర్వహించిన US!

image

మానవ సహిత విమానానికి, కృ‌త్రిమ మేధ ఆధారిత ఎఫ్-16 యుద్ధవిమానానికి మధ్య అమెరికా సైన్యం గత ఏడాది పరీక్షలు నిర్వహించింది. ఈ విషయాన్ని తాజాగా సైన్యం బయటికి వెల్లడించింది. గాల్లో రెండు విమానాలకు మధ్య పోటీ నడిచిందని, ఏఐ అద్భుతంగా విమానాన్ని నడిపిందని తెలిపింది. అయితే, ఆ పోటీలో మనిషి గెలిచాడా లేక ఏఐ గెలిచిందా అన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

News April 24, 2024

రికార్డు సృష్టించిన బౌల్ట్

image

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రికార్డు సృష్టించారు. IPLలో మొదటి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు(26*) తీసిన బౌలర్‌గా నిలిచారు. తొలి ఓవర్‌లో 5వ బంతికి రోహిత్‌ను ఔట్ చేసి బౌల్ట్ ఈ ఫీట్ సాధించారు. దీంతో భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు(25వికెట్లు) చెరిగిపోయింది. ఇదిలా ఉంటే T20ల్లో హిట్‌మ్యాన్‌ను బౌల్ట్ 6సార్లు ఔట్ చేశారు.

News April 24, 2024

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు ఎంతంటే?

image

TG: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట దాదాపు రూ.1250 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య సంగీతా రెడ్డి పేరిట రూ.3,203 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తనకు సొంత కారు కూడా లేదని పేర్కొన్నారు. తనపై నాలుగు క్రిమినల్ ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు.

News April 24, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. యూజర్లు తమ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, గ్రూపులను ఫేవరెట్స్ జాబితాకు యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆయా కాంటాక్ట్‌ని ఈజీగా కనుగొని స్పీడ్ డయల్‌తో పాటు ఈజీగా మెసేజ్‌లు పంపేందుకు వీలుంటుంది. సెట్టింగ్స్ మెనూలో ఈ ఫేవరెట్ ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో కాంటాక్ట్స్ ఆర్డర్‌ను మార్చుకోవడంతో పాటు తొలగించవచ్చు.