News April 24, 2024

సియాచిన్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

image

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్‌నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్‌లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40ఏళ్లు గడిచాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్‌’తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.

News April 24, 2024

సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు <<13060249>>రుణమాఫీ<<>> చేయకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు రైతుబంధు పూర్తిచేయలేదు గానీ.. కొత్తగా రుణమాఫీ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఓడిపోయేందుకు వంద కారణాలున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే ప్రజలు ఓడించరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే మోసం, నమ్మకద్రోహం అని దుయ్యబట్టారు.

News April 24, 2024

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్?

image

TG: కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పొన్నంతో సహా పలువురు జిల్లా నేతలు ఆయనతో వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు KNR టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేడు CM రేవంత్‌తో భేటీ కానున్నారు.

News April 24, 2024

జగన్‌పై దాడి కేసు.. కోర్టులో పోలీసుల పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సతీశ్ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరగా.. 164 సీఆర్పీసీ ప్రకారం వాంగ్మూలం అక్కర్లేదని నిందితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. విచారించిన కోర్టు.. ఈ నెల 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

News April 24, 2024

హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధం: సీఎం మమత

image

2016లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన <<13101174>>తీర్పు<<>>ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. దాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతుగా తాము ఉంటామని చెప్పారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, హైకోర్టు తీర్పుపై తాము పైకోర్టుకు వెళతామని అన్నారు.

News April 24, 2024

ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ సవాల్!

image

IPLలో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పాయింట్స్ టేబుల్‌లో టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను 7వ స్థానంలోని ముంబై ఇండియన్స్ ఢీకొననుంది. జైపుర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే MI 15 గెలవగా.. RR 13 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈరోజు మ్యాచ్ జరుగుతున్న జైపుర్‌లో MIతో జరిగిన 7 మ్యాచుల్లో RR 5 గెలిచింది. దీంతో ముంబైకి నేడు కఠిన పరీక్ష ఎదురుకానుంది.

News April 24, 2024

JEE మెయిన్ (సెషన్-2) ఫైనల్ కీ విడుదల

image

జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ అన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరును పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్టును విడుదల చేయనుంది. కీని చూసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 24, 2024

సీఎం జగన్ తరఫున నామినేషన్ దాఖలు

image

AP: పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ తరఫున ఆయన బంధువు వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆర్‌వోకు అందజేశారు. ఈ నెల 25న సీఎం జగన్ మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. మరోవైపు టెక్కలి అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామపత్రాలు సమర్పించారు. ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు.

News April 24, 2024

ఈ వారం ఓటీటీలోకి 2 కొత్త సినిమాలు

image

ఈవారం రెండు తెలుగు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే గోపీచంద్ నటించిన ‘భీమా’ ఏప్రిల్ 25న నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఇక 26న క్రాక్(హిందీ), థాంక్యూ, గుడ్‌నైట్ హాట్‌‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

News April 24, 2024

పిఠాపురంలో పవన్‌ను తప్పిస్తారేమో: సజ్జల

image

AP: కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిఠాపురంలో పవన్‌‌ను తప్పించి SVSN వర్మను బరిలోకి దింపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి జనసేనకు 10 టికెట్లే పరిమితం చేస్తారన్నారు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందన్నారు. CBN రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని.. గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు.