India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లో ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.
నిన్నటి మ్యాచులో SRH బౌలర్ నటరాజన్ ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన నటరాజన్ మూడు వికెట్లు తీయడమే కాకుండా.. ఏకంగా మెయిడిన్ వేశారు. మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన నటరాజన్ 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. బ్యాటర్లు రెచ్చిపోయిన మ్యాచులో 5లోపు ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘శభాష్.. నటరాజన్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌పై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ససేమిరా అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మెత్తబడ్డారు. చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బుజ్జగించడంతో బీజేపీలో చేరేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఎన్నికల నిమిత్తం నల్లమిల్లి త్వరలోనే బీజేపీలో చేరతారని, దీనికోసం బీజేపీ నేతలతో స్వగృహంలో భేటీ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
AP: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే వీటన్నిటికన్నా ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం. ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట క్షేత్రంలో రేపు రాములోరి కళ్యాణం జరుగుతుంది. సా.6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహిస్తారు. కోదండరాముడి కళ్యాణోత్సవం కోసం తూ.గో జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు 180 కిలోల తలంబ్రాలను అందజేశారు.
కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు. మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచుకు కూడా దూరమయ్యారు.
KKR: సాల్ట్, నరైన్, వెంకటేష్, శ్రేయాస్, రఘువంశీ, రింకు, రస్సెల్, రమణదీప్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, పటీదార్, గ్రీన్, దినేష్ కార్తీక్, లోమ్రోర్, కర్ణ్ శర్మ, ఫెర్గూసన్, దయాల్, సిరాజ్.
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనడం లేదు. రాహుల్ స్థానంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సత్నా, రాంచీ సభల్లో పాల్గొననున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రాహుల్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ సామాజిక కార్యకర్త కేసు పెట్టినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ నెల 19న పోలింగ్ సమయంలో విజయ్ వల్ల అక్కడ ఉన్నవారికి ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపాయి. పోలింగ్ బూత్‌కు విజయ్ తన మద్దతుదారులతో వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించాయి.
జెర్సీ సినిమాను అభిమానులతో కలిసి చూసిన హీరో నాని, భావోద్వేగానికి లోనయ్యారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఆ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో వేసిన ప్రత్యేక షోకు ఆయన హాజరయ్యారు. ‘తన ప్రయాణాన్ని మళ్లీ గుర్తుచేసుకునేందుకు, మరోసారి వీడ్కోలు చెప్పేందుకు అర్జున్ ఈరోజు బతికొచ్చినట్లు అనిపించింది. గుండె బరువెక్కింది’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ప్రముఖ జర్నలిస్ట్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత రవీశ్ కుమార్ యూట్యూబ్ ఛానల్‌కు ఆదరణ భారీగా పెరిగింది. ప్రారంభించిన 16 నెలల్లోనే సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.6Mకు చేరింది. ఇప్పటివరకు 526 వీడియోలను అప్‌లోడ్ చేయగా 980M+ వ్యూస్ వచ్చాయి. దీంతో ఆయన ఆదాయం రూ.కోట్లలోనే ఉన్నట్లు సైడ్ హస్టిల్ వీకెండ్ నివేదిక తెలిపింది. యూట్యూబ్ నుంచి రవీశ్‌కు నెలకు రూ.33 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు వస్తున్నట్లు పేర్కొంది.
ఆస్ట్రేలియాలో ఉబర్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. స్వస్తిక చంద్ర అనే మహిళ గత ఏడాది అక్టోబరులో ఉబర్ ఈట్స్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆమె పేరును హిట్లర్ నాజీ సంకేతంగా భావించిన ఉబర్ మహిళ ఖాతాను నిషేధించింది. బాధితురాలు సుమారు 5 నెలల పాటు సంస్థతో పోరాడింది. అటు ఆస్ట్రేలియా హిందూ మండలి కూడా జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఉబర్ దిగొచ్చింది. స్వస్తికకు సారీ చెప్పి మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.