News April 20, 2024

సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

image

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 20వ రోజు షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటలకు చిన్నయపాలెం బస కేంద్రం నుంచి బయల్దేరి.. పినగాడి, లక్ష్మిపురం, వేపగుంట జంక్షన్ చేరుకుని మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం గోపాలపట్నం, NAD జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడ చేరుకుని రాత్రి బస చేస్తారు.

News April 20, 2024

ఒకే ఓవర్లో 4, 4, 6, 4, 6, 6

image

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ విజృంభించి ఆడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 6, 6తో చెలరేగి ఆడారు.

News April 20, 2024

IPL.. చరిత్ర తిరగరాసిన SRH

image

IPL చరిత్రలో SRH అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. IPL చరిత్రలో 250+ స్కోరు 3 సార్లు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. గతంలో RCB 2 సార్లు ఈ ఘనతను సాధించగా.. ఇవాళ్టి మ్యాచ్‌లో 266/7 రన్స్ చేయడం ద్వారా RCB రికార్డును హైదరాబాద్ టీమ్ బ్రేక్ చేసింది. ఈ సీజన్‌లోనే SRH 287/3(RCB), 277/3(MI), 266/7(DC) మూడు సార్లు 250+ స్కోరు సాధించింది.

News April 20, 2024

సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఏలేటి

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ‘గతంలో టీడీపీకి ఆగస్టు సంక్షోభం ఉండేది. అలానే రేవంత్‌కు కూడా వస్తుంది. రేవంత్ మమ్మల్ని ముట్టుకుని చూడమను? కరెంట్ తీగలో.. మల్లె తీగలో.. ఏ తీగలో తెలుస్తుంది. మోదీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి మొహం మీదే పడుతుంది’ అని ఆయన మండిపడ్డారు.

News April 20, 2024

ట్రావిస్ హెడ్ అన్‌స్టాపబుల్

image

SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌తో ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఈ IPLలో తొలి బంతి నుంచే బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. ఏకంగా 216 స్ట్రైక్ రేట్‌తో 324 రన్స్ బాదారు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నారు. SRH తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, హండ్రెడ్.. పవర్‌ప్లేలోనే 3 అర్ధ సెంచరీలు చేశారు. ఇదే ఊపులో డబుల్ సెంచరీ బాదినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

News April 20, 2024

కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర: ఆతిశీ

image

బీజేపీ ఆదేశానుసారం తిహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర జరుగుతోందని మంత్రి, ఆప్ నేత ఆతిశీ ఆరోపించారు. జైలు అధికారుల <<13092251>>నివేదిక<<>> చూస్తే బీజేపీ చేస్తున్న కుట్ర అర్థమవుతోందన్నారు. ‘రక్తంలో షుగర్ లెవల్ 300 ఉంటే ప్రమాదకరమని ఏ డాక్టర్ అయినా చెబుతారు. ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడంలో జైలు అధికారులకు ఇబ్బంది ఏంటి? ఆయన జైలుకెళ్లే ముందు ప్రతిరోజూ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకునేవారు’ అని ఆతిశీ తెలిపారు.

News April 20, 2024

ఓపెనర్ల విధ్వంసం.. SRH భారీ స్కోరు

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టీమ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు హెడ్(89), అభిషేక్ శర్మ(46) ధాటికి స్కోరు ఓ దశలో 300 దాటుతుందని అనిపించింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి SRH స్కోరు కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. చివర్లో షాబాజ్ అహ్మద్(59*) నితీశ్ రెడ్డి(37) రాణించడంతో 20 ఓవర్లలో SRH 266/7 రన్స్ చేసింది. DC బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు, ముకేశ్, అక్షర్ చెరో వికెట్ తీశారు.

News April 20, 2024

చిరంజీవిని జగన్ అవమానించారు: పవన్

image

AP: రాజానగరం వారాహి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా చుట్టూ ఉన్నవారు ఎవరో తెలియాలనే పొగపెట్టా. అందరూ వైసీపీలోకి వెళ్లారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే. నాపై చాలాసార్లు రాళ్లు విసిరారు, తట్టుకున్నా. జగన్‌లా డ్రామాలు ఆడలేదు. సినిమా టికెట్ ధరలు పెంచాలని వెళ్తే.. చిరంజీవిని జగన్ అవమానించారు’ అని ఫైరయ్యారు.

News April 20, 2024

మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

image

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా నిర్మాత గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా గురించి రాజమౌళికి తప్ప మరెవరికీ వివరాలు తెలియవు. స్టోరీ, షూటింగ్, క్యాస్టింగ్, రిలీజ్ వంటి విషయాలు ఆయనొక్కరికే తెలుసు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.

News April 20, 2024

రేవంత్ పదవి కోసం ఎవరినైనా తొక్కుతారు: హరీశ్

image

TG: హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదన్నారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన పదవి కోసం ఎవరినైనా తొక్కుతారని విమర్శించారు.